గ్రూపు-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తప్పనిసరి.. ఉత్తర్వులు జారీ

-

ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ వన్ ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. గతంలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం… తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంది. ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్దరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ వన్ లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు సరైన అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు పెడుతున్నట్లు పేర్కొన్న ప్రభుత్వం… ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే.. ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఏకంగా 92 గ్రూప్1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఎపీపీఎస్సీ. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అలాగే.. ఎఎంవీఐ ఉద్యోగాలకు నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచనలు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news