నాటో వార్నింగ్ ను కేర్ చేయని పుతిన్.. రష్యాలో ఉక్రెయిన్ నాలుగు భూభాగాలు విలీనం

-

ఎన్ని హెచ్చరికాలు చేసినా వృథా అయ్యాయి. అమెరికా, నాటో వార్నింగ్ లను పుతిన్ కాస్త కూడా కేర్ చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై భీకర యుద్ధాన్ని ప్రకటించిన పుతిన్.. అప్పటి నుంచి ఆ దేశ భూభాగాలను వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఉక్రెయిన్ లోని నాలుగు భూభాగాలను పుతిన్ రష్యాలో విలీనం చేశారు.

ఉక్రెయిన్​పై సైనికచర్య సందర్భంగా స్వాధీనం చేసుకున్న దొనెత్స్క్ , లుహాన్స్క్ , జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి. క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని తెలిపారు. విలీన ఒప్పందంపై దొనెత్స్క్ , లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. అయితే, పుతిన్‌ చేసిన ప్రకటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు. ప్రకటన పనికిరానిదని.. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు.

రష్యా విలీనం చేసుకున్న ఆ నాలుగు భూభాగాల్లో నాటో దళాలు ఇక అక్కడ అడుగు పెట్టలేవు. ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే మాత్రం.. పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారిపోతుంది. అది అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news