జగన్‌ సర్కార్‌ పై మేకపాటి వివాదస్పద వ్యాఖ్యలు..కొత్త రోడ్లు వేయలేమంటూ !

-

జగన్ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుపై మరో సారి తన స్టైల్‌ లో విమర్శలు చేశారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.

ఈ సందర్బంగా గ్రామంలో సిసి రోడ్లు వేయాలని ఎమ్మెల్యేని కోరారు స్థానికులు. అయితే, దానికి రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. వేసిన రోడ్లకు బిల్లులు రాక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని..కొత్త రోడ్లు వేయడం కుదరదన్నారు ఎమ్మెల్యే మేకపాటి. అయితే, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్థానికులు , అధికారులు, నాయకులు అవాక్కయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news