BREAKING : ఈ నెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

BREAKING : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఈ నెల 3న అంటే నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఇక నిన్న గవర్నర్‌ ప్రసంగం జరుగగా, ఈ నెల 6వ తేదీన తెలంగాణ బడ్జెట్‌ ను హరీష్‌ రావు ప్రవేశ పెడతారు. ఇక 7వ తేదీ నుంచి.. 12 వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్‌ చర్చ ఉండనుంది. ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశ ప్రజల చూపు కేసీఆర్ వైపు ఉంది.. రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదు.. ఓ విజన్‌ ప్రకారం నాయకులు పని చేయాలి.. యూఎన్‌వో కూడా రైతుబంధును ప్రశంసించింది.. పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్‌వన్‌గా ఉన్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news