టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు నేటి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. మే 17 వరకు అప్లై చేసుకోవచ్చు. రూ. 50 లేట్ ఫీజుతో మే 22 వరకు ఛాన్స్ ఇచ్చారు. జవాబు పత్రాల రీకౌంటింగ్, వెరిఫికేషన్, జిరాక్స్ కాపీల కోసం మే 13 లోపు ఫీజు చెల్లించాలి.
రీ కౌంటింగ్ కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500, రీవెరిఫికేషన్, ఆన్సర్ షీట్ల జిరాక్స్ కాపీలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చెల్లించాలి. జూన్ 2 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. కాగా, టెన్త్ ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. ఏకంగా 488 మార్కులు సాధించింది. ముప్పల హేమశ్రీ కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆమె చదువులో అసమాన ప్రతిభ కనబరుస్తుండగా… విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా హేమశ్రీ తెలివితేటలు పరీక్షించి టెన్త్ పరీక్షలు రాయడానికి అనుమతిచ్చారు. నిన్న ఫలితాల్లో 428 మార్కులు తెచ్చుకోని ఔరా అనిపించింది.