సీనియర్‌ సిటిజెన్లకు గుడ్‌ న్యూస్‌..!

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. సీనియర్‌ సిటిజెన్ల కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని ఇస్తున్నారు. వయో వృద్ధులకు స్థిరమైన రాబడితో పాటు అధిక వడ్డీని సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ ఇస్తోంది. ఈ స్కీమ్ తో మంచి లాభం సీనియర్ సిటిజన్లకి వస్తోంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతము ఈ స్కీమ్ కింద వడ్డీ రేటు అధికంగా ఉంది. ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ లో 2022 జనవరిలో 7.4% వడ్డీ రేటు ఇచ్చేవారు. రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసిక వడ్డీ రూ.27,750 వచ్చేది. ఇప్పటి వరకు రూ.1,38,750 వడ్డీగా వస్తూ ఉంటే ఇప్పుడు అదే స్కీమ్‌ పై వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది.

వడ్డీని 8.2%కి పెంచింది. అయితే ఆ పాత తక్కువ వడ్డీ ఉన్న ఖాతాను క్లోజ్ చేసేసి.. ఇప్పుడు ఎక్కువ వడ్డీ దాన్ని తెరిస్తే.. పెట్టుబడి పెట్టిన మొత్తంలో 1.5% అంటే రూ. 22,500 ప్రీమెచ్యూర్ క్లోజర్ పెనాల్టీగా విధిస్తారు. సీనియర్ సిటిజన్ ఖాతా ప్రారంభించి ఒక సంవత్సరం అయ్యిందంటే ఈ ఖాతాలో ప్రీ మెచ్యూర్‌ క్లోజర్‌కి 1.50% మాత్రమే ఉంటుంది. సో పాత ఖాతాను ముగించి, కొత్త వడ్డీ ప్రకారం కొత్త ఖాతాను ప్రారంభించడం వలన ప్రాఫిట్ ఏ. బ్యాంకుకు కట్టే పెనాల్టీ మొత్తాన్ని కూడా కొత్త వడ్డీ రేటు ప్రకారం రెండేళ్లలోనే తిరిగి సంపాదించవచ్చు.

రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్‌లు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సీనియర్ సిటిజన్ ఇప్పటికే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేస్తే పాత ఖాతాలో రూ. 1.5 లక్షలను వదిలివేసి విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు పన్ను మినహాయిపును కూడా పొందవచ్చు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధికి ముందు ఎప్పుడు అయినా కూడా అకౌంట్ ని క్లోజ్ చేసుకోవచ్చు.

అకాల మూసివేత కోసం కొన్ని జరిమానాలు చెల్లించవలసి వుంది. అకౌంట్ ఓపెన్ చేసిన నుంచి ఏడాది పూర్తి కాకుండానే ఖాతాను మూసివేస్తే మీకు ఏ వడ్డీని ఏ బ్యాంకు చెల్లించదు. ఖాతాను ప్రారంభించిన ఏడాది నుంచి రెండేళ్ల లోపు మూసివేస్తే 1.5 % పెనాల్టీగా విధిస్తారు.రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య మూసివేస్తే ప్రిన్సిపాల్‌ అమౌంట్లో 1% పెనాల్టీ పడుతుంది. 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయితే ఇంకో మూడేళ్లు పొడిగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news