బంజారాహిల్స్ లోని టిడిపి నేత ఇంటికి ఏపీ సిఐడి పోలీసులు

-

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ట్రెండ్ సెట్ లో ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి శనివారం ఏపీ సిఐడి పోలీసులు వెళ్లారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పిల్లలను కూడా ప్రశ్నించారు. అనంతరం విజయ్ ఇంటి పనిమనిషికి 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు అందజేశారు. ఈనెల 6వ తేదీన మంగళగిరిలోని తమ కార్యాలయంలో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు.

ఓ కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే ఇంటికి వచ్చామని సీఐడీ అధికారి పెద్దిరాజు తెలిపారు. నోటీసులు ఇచ్చి వెళ్తున్న సమయంలో కొంతమంది టిడిపి నాయకులు విజయ్ ఇంటికి చేరుకున్నారన్నారు. ఇంట్లో దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వచ్చింది పోలీసులా కాదా అని అనుమానం ఉందని బంజారాహిల్స్ పీఎస్​లో టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news