ఇంటర్వ్యూ లో సక్సెస్ పొందాలంటే వీటిని మరచిపోకండి..!

-

ఎవరికైనా ఉద్యోగం రావాలంటే మొదట ఇంటర్వ్యూ లో సక్సెస్ అవాలి ఇంటర్వ్యూ లో సక్సెస్ అయితేనే ఉద్యోగం ఇస్తారు. ఏదైనా ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ కీలకమైనది కాబట్టి ఇంటర్వ్యూలో కచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు బెస్ట్ అని వాళ్ళకి తెలియాలి. ఆ కొద్ది సమయంలోనే మీరు మీ సామర్థ్యం ఏమిటో చెప్పేయాలి. అయితే ఇంటర్వ్యూ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటే వీటిని కచ్చితంగా అనుసరించండి. అప్పుడు ఇంటర్వ్యూ సులభమవుతుంది.

 

మంచి ఇంప్రెషన్ కలిగేలా చేయండి:

మంచి ఇంప్రెషన్ కలిగితే సరిపోతుంది దీనివల్ల ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోవచ్చు. కాన్ఫిడెన్స్ తో ఉండడం, ధైర్యంగా ఉండటం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఉపయోగించడం లాంటివి చేయాలి ఇలా ఉంటే వాళ్లకి మీ పై ఆసక్తి కలుగుతుంది.

ఐ కాంటాక్ట్ ఇవ్వండి:

ఐ కాంటాక్ట్ ఇస్తే మీరు పర్ఫెక్ట్ గా ఉంటున్నట్లు వాళ్ళకి తెలుస్తుంది ఇంటర్వ్యూయర్ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. ఇది చాలా ముఖ్యం.

అతిగా మాట్లాడకండి:

చక్కగా అనవసరమైనవి లేకుండా అవసరమైన వాటిని మాత్రమే మాట్లాడండి అతిగా మాట్లాడటం వల్ల కలిగే ఇంప్రెషన్ మొత్తం పోతుంది.

పాజిటివ్ గా మాట్లాడండి:

ఎప్పుడు కూడా మీరు మీ పాత కంపెనీల గురించి కానీ పాత బాస్ గురించి కానీ పాజిటివ్ గానే మాట్లాడండి నెగిటివ్ గా అస్సలు మాట్లాడకూడదు.

అబద్ధాలు చెప్పకండి:

ఇంటర్వ్యూలో ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అబద్దాలు చెప్పడం వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుంటాయి.

కాన్ఫిడెన్స్ తో ఉండండి:

కంగారు పడకుండా ఒక మాట మీద నిలబడండి కాన్ఫిడెన్స్తో ఉండండి ఇలా ఈ టిప్స్ ని ఫాలో అయితే కచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news