గత ఐదేళ్ళలో ఏపీ చాలా ఇబ్బందులు పడింది : సీఎం చంద్రబాబు

-

ప్రపంచానికి సేవలు చేసే అవకాశం భారతదేశానికి ఉంది. కోవర్కింగ్ స్పేస్ లలో కొత్త కంపెనీలు పెడతాం. 55700 అంగన్వాడీలకి 2 నెలల్లోగా ఇండక్షన్ స్టవ్ లు ఇస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. PMAY కింద‌ ఇళ్ళు కట్టుకున్న వారికి కరెంటు బల్బులు ఇచ్చాం. ప్రతీ ఇంటికి 20% కరెంటు ఆదా చేసుకునే అవకాశం EESL పరికరాలు వాడితే వస్తుంది. పవర్ జనరేషన్ ను ప్రజాస్వామ్యం చేయడం వల్ల మీ ఇంటి విద్యుత్ మీరే చేసుకోవచ్చు. సోలార్ పవర్ ను వినియోగించుకుంటే.. కరెంటు బిల్లు కట్టక్కర్లేదు. సోలార్ పవర్ తయారు చెసుకుని అవసరం అయితే 500 యూనిట్లు కరెంటు గ్రిడ్ కి ఇవ్వచ్చు. ప్రజలకు అవసరమైనపుడు అదే కరెంటు వారికి తిరిగిస్తాం. వాట్సప్ మెసేజ్ తో పని పూర్తి చేస్తాం.. అలా పూర్తి చేయకపోతే.. యాక్షన్ కూడా తీసుకుంటాం అం చంద్రబాబు తెలిపారు.

గత ప్రభుత్వ పనుల వలన రెవెన్యూ సదస్సులు పెట్టాల్సిన పరిస్ధితి తెచ్చారు. ఒక రోజులో 12 వేల పిటిషన్లు వచ్చాయి. విద్యుత్ డిపార్ట్మెంట్ లో గత ప్రభుత్వం చేసిన తప్పులు తప్ప ఇంక తప్పు జరక్కుండా చూసుకుంటాం. సోలార్, గ్రీన్, పంపుడ్ ఎనర్జీ లను తీసుకొస్తాం. 40వేల విద్యుత్ కనెక్షన్లు రైతులకు ఇస్తున్నాం. 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించాం. ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయించాం. రాబోయే ఐదేళ్ళలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అయితే గత ఐదేళ్ళలో ఏపీ చాలా ఇబ్బందులు పడింది. రాష్ట్రంలో ఎనర్జీ ఇదే విధంగా అధికంగా ఉండాలి… 2047 నాటికి ఏపీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news