నాన్న‌కు ప్రేమ‌తో.. జ‌గ‌న్ రుణం తీర్చుకుంటున్నారా..?

-

ఈ రోజు అంత‌ర్జాతీయ తండ్రుల దినోత్స‌వం. త‌మ‌కు జ‌న్మ‌నిచ్చిన తండ్రులకు, త‌మ‌కు విద్యాబుద్ధులు నేర్పించి, వృద్ధిలోకి తెచ్చిన నాన్న‌లను పిల్ల‌లు స్మ‌రించుకునే రోజు ఇది! అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్వ హించుకునే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యం కూడా ఉంది. మ‌రి ఈ రోజున మ‌న రాష్ట్రంలోని రాజ‌కీయ వార‌సులు ఏమేర‌కు రుణం తీర్చుకున్నారు. లేదా నాన్న‌ల‌కు చిర‌స్థాయిలో గుర్తింపు నిచ్చే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. `అంత‌కుమించి` – అనే విధంగా పిల్ల‌లు త‌ల్లిదండ్రుల‌కు ఏమైనా చేశారా? అనేది చూస్తే.. చాలా త‌క్కువ మంది మ‌న‌కు క‌నిపిస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ వార‌సులు ఉన్న‌ప్ప‌టికీ.. `తండ్రికి త‌గ్గ త‌న‌యుడు`- అని అనిపించుకునేవారు అత్యంత అరుదుగా మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.

ఇలాంటి వారిలో మ‌న‌కు ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్న‌వారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. తండ్రి వైఎ స్ రాజ‌శేఖ‌రరెడ్డి ఆశీస్సుల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మి అనేది ఎరుగ కుండా ప్ర‌జా క్షేత్రంలో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు, త‌న‌కు ఎదురైన అనేక అవ‌మానాలు, అప‌నిం ద‌లు, ఆటు పోట్ల‌ను త‌ట్టుకుని రాజ‌కీయాల్లో ఎదిగారు. త‌నకంటూ ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసుకుని ఎవ‌రినీ దేబిరించ‌కుండా.. ఎవ‌రికీ వెన్నుపోటు పొడ‌వ‌కుండా ముందుకు సాగుతున్నారు.

అత్యంత క‌ష్ట‌సా ధ్య‌మ‌ని తెలిసి కూడా.. 18నెల‌ల పాటు దాదాపు 4 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చో టు సంపాయించుకున్నారు.
గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చా రు. అంతేకాదు.. అడుగ‌డుగునా.. త‌న తండ్రి బాట‌లో పేద‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. త‌న ప్ర‌భుత్వం పేద‌ల ప‌క్ష‌పాతిగా ముందుకు న‌డ‌వాల‌నే దృఢ సంక‌ల్పంతో జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగు.. పేద‌ల‌కు చేరువ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తి ప‌థ‌క‌మూ.. ఆయ‌న పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌న తండ్రి పాలించిన ఐదేళ్ల కాలంలో ఎలా అయితే.. ప్ర‌భుత్వాన్ని వారికి చేరువ చేశారో.. అదేవిధంగా ముందుకు తీసుకువెళ్తు న్నారు. ప్ర‌తి ప‌థ‌కానికీ త‌న తండ్రి పేరు పెడుతున్నారు. ప్ర‌తి ఇంటికీ(అర్హులైన‌) వాటిని చేర‌వేస్తున్నారు. ఈ నాన్న‌ల దినోత్స‌వం నాడు.. ఇంత‌క‌న్నా..ఏ కుమారుడైనా.. తండ్రి ఇచ్చే కానుక ఏముంటుంది!?!

Read more RELATED
Recommended to you

Latest news