ఏపీ సీఎస్ స‌మీర్ శ‌ర్మ ప‌ద‌వీ కాలం 6 నెల‌లు పొడిగింపు…

ఏపీ సీఎస్‌ గా కొనసాగుతున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును పొడగించారు. మరో నెలల పాటు ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును పొడిగిస్తూ.. కేంద్ర సర్కార్‌ శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీ సీఎస్‌ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ.. ఈ నెలాఖరుతో తన సర్వీసును ముగించాల్సి ఉంది.

అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌.. సమీర్‌ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలంటూ కేంద్ర సర్కార్ కు లేఖ రాశారు. జగన్‌ ప్రతి పాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర సర్కార్‌.. ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

నవంబర్‌ 30 వ తేదీ వరకు పొడిగించేందుకు అంగీకరించింది కేంద్ర సర్కార్‌. ఈ మేరకు డీవోపీటీ శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్‌ 30 వ తేదీ వరకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ సర్వీసులో ఉండనున్నారు.