ఏపీ తీవ్ర వర్ష సూచన…. బంగాళాఖాతంలో అల్పపీడనం, తుఫాన్ గా మారే అవకాశం..

-

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళా ఖాతంలో కార్ నికోబార్ దీవులకు ఆగ్నేయ బంగాళాఖాతంలో  170 కిలోమీటర్ల దూరంలో ఈరోజు( శనివారం) ఉదయం అల్పపీడనం ఏర్పడింది. మే 8 నాటికి ఇది తుఫాన్ గా మారుతునందని ఐఎండీ తెలిపింది. మే 10 వరకు వాయువ్య దిశగా కదిలి, ఆతరువాత ఉత్తర ఈశాన్య దిశగా దశ మార్చుకుంటుందని ఐఎండీ అంచానా వేసింది.

కాగా అల్పపీడనం శనివారం సాయంత్రం నాటికి వాయుగుండంగా మారుతుందని… ఆదివారం బలంపుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 10వ తేదీ సాయంత్రానికి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, ఒడిశాలోని గోపాల్ పూర్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తోెంది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా మరియు దక్షిణ ఒడిశా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం సముద్రంలో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మరికొన్ని గంటల్లో గాలుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అలెర్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news