ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చాలా చొరువ చూపుతున్నారు. కొంత మంది ప్రత్యేకంగా జనసేన కార్యాలయం వద్దకు దరఖాస్తులను తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ తరుణంలోనే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దశాబ్దాలుగా వస్తున్న మూస ధోరణీకి ఆయన స్వస్తీ చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఖర్చుల నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25వేలు, మైనర్ గ్రామపంచాయతీలకు రూ.10వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామపంచాయతీలకు రూ.250 ఖర్చుల నిమిత్తం ఇస్తూ వస్తున్నారు.