నా మీద రాజకీయ ఒత్తిడి లేదు: ఏపీ డీజీపీ

-

పోలీసుల తీరుపై కోర్టులు కామెంట్స్ చేసాయి గాని… తప్పు జడ్జిమెంట్స్ ఇవ్వలేదు అని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదు అని ఆయన స్పష్టం చేసారు. మేము చట్ట బద్ధం గానే పని చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో పోలీస్ శాఖ మరింత మెరుగైన సేవలు అందిస్తాం అని చెప్పుకొచ్చారు. లాకప్స్ లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని డీజీపీ చెప్పారు.

ఇటీవల సుప్రీంకోర్టు కూడా పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అని, సీసీ టీవీల ఏర్పాటు ద్వారా పోలీస్ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది అని స్పష్టం చేసారు. పోలీసులపై ఫిర్యాదు చేయటానికి టోల్ ఫ్రీ నంబర్ ను డీజీపీ పరివేక్షణలో త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అందరూ కరోనా నిబంధనలు పాటించటం చాలా అవసరం అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా లో పోస్టులను నమ్మవద్దు, చెక్ చేసుకోండి అని ఆయన సూచనలు చేసారు. ఇప్పటి వరకు నూతన ఏడాది వేడుకలపై నిషేధం ఏమీ లేదు అని స్పష్టం చేసారు. కరోనాలో కొత్త వేవ్ వస్తోంది, చలికాలం కాబట్టి నిబంధనలు మాత్రం పాటించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. కరోనా సెకండ్ వైరస్ పై… మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగా ఉంది అని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news