ముంపు భాదిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టింది అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగేవిజయవాడ ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నం అయ్యింది. అలాగే రాష్ట్రంలో ఇంతవరకు వర్షాలు,వరదల కారణంగా 19 మంది మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు.
అదే విధంగా 136 పశువులు, 59,700 కోళ్ళు మరణించాయి. 134 పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6 వేల పశువులకు వ్యాక్సిన్ అందించడం జరిగింది. 1,72,542 హెక్టార్లలో వరి పంట, 14,959 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు నీట మునిగినవి. ప్రకాశం బ్యారేజి వద్ద 11,25,876 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే 41927 మందికి 176 పునరావాస కేంద్రాల ద్వారా పునరావాసం కల్పించాం. 171 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశాము. సహాయక చర్యల్లో 36 NDRF, SDRF బృందాలు నిరంతర సేవలు అందిస్తున్నాయి. భాదితులకు ఈరోజు 3 లక్షల ఆహార ప్యాకేట్లు, త్రాగునీరు ఎప్పటికప్పుడు అందించేందుకు 5 హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నాము. 188 బోట్లును, 283 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాము అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.