ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. స్కూల్స్ లో కుల, మత ప్రస్తావన వద్దు !

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఏపీలోని కొన్ని స్కూళ్లల్లోని అటెండెన్స్ రిజిస్టర్లో కుల, మత ప్రస్తావన వస్తుందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలానే హాజరు పట్టికలో బాలికల పేర్లను కూడా రెడ్ ఇంకుతో రాస్తున్నారని దృష్టికి వచ్చింది. దీంతో హాజరు పట్టికలో కుల, మత ప్రస్తావన చేస్తున్నారంటూ విద్యా శాఖ ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయి.

దీంతో ఇక మీదట హాజరు పట్టికలో కుల, మత ప్రస్తావన చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు సర్కులర్ జారీ చేశారు. అలానే ఇక మీదట బాలికల పేర్లను కూడా రెడ్ ఇంకుతో రాయొద్దంటూ సూచనలు చేసి హాజరు పట్టీలో అందరి పేర్లను ఒకే పద్దతిలో రాయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా చేస్తే వారికీ వీరికీ ఎదో తేడా ఉందని వారు భావించే అవకాశం ఉందని దాని వలన బాలికల్లో ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news