పురుడు పోయాలంటే సెల్ ఫోన్ లైట్లు, క్యాండిల్స్ కావాల్సిందే…. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి

-

సామాన్యుడికి, పేదవారికి ఏదైనా సుస్తీ చేస్తే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభుత్వ ఆసుపత్రులే. అలాంటి ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ చాలా ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రులను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. 

తాజాగా ఏపీలో కరెంట్ కోతలతో ఆస్పత్రిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పేషెంట్లు. అనకాపల్లి, నర్సీపట్నంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు విద్యుత్ లేదు… ప్రత్యామ్నాయంగా జనరేటర్ సౌకర్యం ఉన్నా అది కూడా పనిచేయడం లేదు. దీంతో గర్భిణీలు, చంటి పిల్లలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. దోమలు, ఉక్కపోతలతో నరకం అనుభవించారు. ఇదిలా ఉంటే చివరకు పురుడు పోయాలంటే సెల్ ఫోన్ లైట్లు, క్యాండిళ్లు, టార్చిలు తీసుకుని రావాల్సిందిగా గర్భిణీ బందువులను ఆసుపత్రి సిబ్బంది కోరడం కొసమెరుపు. ఇలా ఉంది ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి. ఇటీవల కాలంలో ఏపీలో విద్యుత్ కోతలు కూడా ఎక్కువ అయ్యాయి. అయితే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన ఆస్పత్రి సిబ్బంది కూడా తమకు పట్టనట్లుగా వ్యహరించడంతో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. చంటి పిల్లలలో ఓ వైపు, కాన్పు నొప్పులతో ఓవైపు తల్లులు తల్లడిల్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news