ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ !

-

ఏపీ ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది ఏపీ ఇంటర్ బోర్డు. ఈ మేరకు ఇంటర్ విద్య బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్, ఒకేషనల్ రెండో ఏడాది రెగ్యులర్, ప్రవేటు విద్యార్థులకు పొడిగింపు వర్తింస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది పరీక్ష తప్పిన విద్యార్థులకు.. హాజరు మినహాయింపున్న ఆర్ట్స్ విద్యార్థులకు వెసులుబాటు ఇస్తున్నామని ఆయన్ అన్నారు. గ్రూప్ మార్చుకొనే విద్యార్థులకు ఫిబ్రవరి 18 వరకు పరీక్ష ఫీజులు చెల్లించొచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇక ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును కూడా పొడిగించినట్లు నిన్ననే తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ జలీల్‌ ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రూ.100 ఆలస్య రుసుంతో మార్చి 1 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే రూ.1000 ఆలస్య రుసుంతో మార్చి 15 వరకు, రూ.2000 ఆలస్య రుసుంతో మార్చి 22వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news