ప్రేమికుల వారం ఫిబ్రవరి 7వ తేదైన మొదలైన ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. ఈ వారం రోజుల పాటు ప్రేమికులందరూ ఒక్కో రోజుని ఒక్కో రకంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అలా ఈ ఫిబ్రవరి 12వ తేదీన కౌగిలింతల దినోత్సవంగా జరుపుకుంటారు. కౌగిలింతలకి చాలా ప్రత్యేకత ఉంది. ఆప్యాయమైన కౌగిలింత అన్ని ఒత్తిడులని దూరం చేయదంతో పాటు అవతలి వారికి చాలా దగ్గర చేస్తుంది. ఇద్దై మధ్య బంధాన్ని బాగా పెంచుతుంది.
ఎక్కువ సేపు కౌగిలించుకుంటే మెదడులో హార్మోన్లు విడుదలయ్యి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే, ఆ పనిచేసిన అలసటని ఒక్క కౌగిలింత దూరం చేస్తుంది. మిమ్మల్ని ప్రేమించినవారు మీకోసం ఎదురుసూస్తూ రాగానే కౌగిలింతతో ఆహ్వానం పలకడం వంటివి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.
ఈ కౌగిలింత రోజున మీకు ఇష్టమైన వారికి కౌగిలింతల్ని పంపుతూ అందమైన కొటేషన్లకి జోడించాలనుకుంటున్నారా? అయితే ఈ కొటేషన్లు మీకోసమే.
నీ మీద ఉన్న ప్రేమని మాటల్లో చెప్పలేను. అందుకే నిన్ను దగ్గరకి తీసుకుని కౌగిలించుకుని నా గుండె శబ్దాన్ని వినమన్నాను. ఇప్పటికైనా నాలో నీపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్నావా? హ్యాపీ హగ్ డే డియర్.
జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలని దాటుకుంటూ వెళ్ళడానికి మంత్రదండం ఏమి అక్కరలేదు. నీ కౌగిలిలో నన్ను బంధిస్తే అదే చాలు.. ఆ కష్టాలన్ని దాటడానికి కావాల్సిన శక్తి అదే వస్తుంది.
కౌగిలింత అనేది చిన్న విషయమే కావచ్చు. కానీ నువ్వు నన్నుకౌగిలించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. హ్యాపీ హగ్ డే డియర్.