వరద బాధితులకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు భారీ విరాళాన్ని అందజేశారు. వారి ఒక్కరోజు వేతనం ఇచ్చి వరద బాధితులకు అండగా నిలిచారు. సుమారు పది లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒక్క రోజు వేతనం 120 కోట్లు పైగా వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేశారు. 2022 లో ఉద్యోగులు “ఛలో విజయవాడ” ఉద్యమం చేసినప్పుడు విజయవాడ ప్రజలు ఉద్యోగులకు అండగా నిలిచారు.
వరద బాధితుల్లో అనేకమంది చిరు ఉద్యోగులు, కార్మికులు, వర్కర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వారు నేటికీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక చిరు ఉద్యోగులకు కూడా ప్రభుత్వం సహాయం అందజేయాలి వారు కోరుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ఇంకా ముందుకు రావాలని కోరుతున్నారు.
వరద బాధితులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో చేపడుతున్న సహాయక చర్యలు అభినందనీయం అని కొనియాడారు. 75 ఏళ్ల వయస్సులో ఉన్న ముఖ్యమంత్రి అంకితభావం స్ఫూర్తిదాయకం అన్నారు. ఇబ్బందులలో ఉన్నప్పటికీ సహాయక చర్యలలో బాధ్యతతో కష్టించి పనిచేయాలన్నారు.