బీఆర్ఎస్ నాయకులు మీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని.. మాటలు మేము కూడా అనగలమని మాకు సంస్కారం అడ్డొస్తుందని తెలంగాణ కాంగ్రెస్ సంచలన ట్వీట్ చేసింది. ముఖ్యంగా ‘అన్నీ మేమే చేస్తే.. నువ్వు ఏం పీకుతావు రేవంత్.?’ అని బీఆర్ఎస్ చేసిన ట్వీట్ కు తాజాగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. “కేటీఆర్, హరీశ్ రావు తమ సోషల్ మీడియాను అదుపులో ఉంచుకోవాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు” అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ లో పేర్కొంది.
కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడు.. అధికారంలో ఉన్నప్పుడు పీకింది ఏమి లేదు. కోల్పోయిన తరువాత కూడా కేసీఆర్ పెద్దగా పీకింది ఏం లేదు అన్నారు. మా పార్టీ విలువలను కాపాడుతూ.. ప్రజా స్వామ్య బద్దంగా విమర్శలు చేస్తున్నామని తెలిపారు. మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం పట్ల మీ పార్టీ విధానాలు, నాయకత్వం మీ ఆలోచనలు ఎలాంటివో అర్థం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.