ఏపీలో ”పీఎం స్వనిధి” పథకం సమర్థంగా అమలు చేసినందుకు 38 మంది అధికారులకు పీఎం స్వనిధి అవార్డులను ఇటీవల ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పలు మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులకు అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ”పీఎం స్వనిధి” పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు ఈ అవార్డులు ఇచ్చింది. అయితే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందించారు మంత్రి నారాయణ.
పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్దిదారులను సన్మానించారు మంత్రి నారాయణ. అనంతరం ఈ మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు పదివేల రుణాన్ని తొలుత కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పేదలు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే 7శాతం వడ్డీ ని కేంద్రం మాఫీ చేస్తుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తూ పోయిన వారికి 50 వేలు ఆపైన రుణం అందిస్తున్నాం. సకాలంలో లోన్లు చెల్లిస్తే గరిష్టంగా 85 వేలు,ఆపైన వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పించారు. 20-24.. ఏడాదిల్లో 5.03 లక్షల మందికి 741 కోట్లు రుణాలను అందించాం. ఈ 2024లోనే పేదలకు 288 కోట్లు రుణాలు ఇచ్చాం అని ఆయన పేర్కొన్నారు.