ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ 1 – సీఎం జగన్

-

పారిశ్రామిక ప్రగతి గతంలో కంటే ఇప్పుడు బాగుందని.. వరుసగా మూడవ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా నిలిచిందని వెల్లడించారు సీఎం జగన్. MSME రంగం ద్వారా 12 లక్షల మందికి ఉపాధి లభించిందని.. తమ హయాంలో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పై విశ్వాసం పెరిగిందన్నారు. గడిచిన మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి అన్నారు.

బల్క్ డ్రగ్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. 17 రాష్ట్రాలతో పోటీపడి బల్క్ డ్రగ్స్ పార్కు సాధించామన్నారు సీఎం జగన్. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసారని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన సెంచూరీ ప్లైవుడ్, సన్ ఫార్మా, బిర్లా, అదాని, ఆదిత్య మెటల్ వంటి సంస్థలే ఏపీకి వస్తున్నాయన్నారు. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం నిలదొక్కుకుందన్నారు. మంచి పనితీరుతో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news