కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మొత్తం 58 రకాల ఆర్‌టీఓ సర్వీసులను ఆన్ లైన్ అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. వెహికిల్ రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ఇలా 58 రకాల సర్వీసులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందే అవకాశం వుంది. పూర్తి వివరాలను చూస్తే..
ఈ సర్వీసులను ప్రజలు స్వచ్ఛందంగా ఆధార్ అథెంటికేషన్ తో పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్ లో, ఫేస్‌లెస్ తోనే వీటిని పొందచ్చట. కంప్లియెన్స్ భారాన్ని తగ్గించేసింది. పైగా టైం కూడా సేవ్ అవుతుంది. పని కూడా ఏ కష్టం లేకుండా ఈజీగా మనం ఆన్ లైన్ ద్వారానే పొందొచ్చు. ఇక ఇది ఇలా ఉంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పరిమితిని కూడా ఆన్ లైన్ ద్వారానే పొందొచ్చు.
కండక్టర్ లైసెన్స్ లో అడ్రస్ మార్పును, మోటార్ వెహికిల్ ఓనర్ షిప్ మార్పును కూడా ఈజీగా ఆన్ లైన్ లోనే పొందేందుకు అవుతుంది. అయితే ఆధార్ కార్డు లేని వారు మాత్రం ఆర్‌టీఓ ఆఫీసుకి వెళ్లాల్సిందే. ఇది వరకైతే 18 రకాల ఆర్‌టీఓ సర్వీసులనే కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ లో ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం 58 రకాల సర్వీసులను ఇస్తోంది.