ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటర్ లో పాస్ కాలేదని, మార్కులు తక్కువ వచ్చాయనే కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిత్తూరు జిల్లాలో అనూష(17), బాబు(17), అనకాపల్లిలో తులసి కిరణ్(17), శ్రీకాకుళం జిల్లాలో తరుణ్(17), విశాఖ జిల్లాలో అఖిల శ్రీ(16), బోనెల జగదీష్(18), అనంతపురం జిల్లాలో మహేష్(17), ఎన్టీఆర్ జిల్లాలో షేక్ జాన్ సైదా(16), చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. గత రెండు వారాల కింద ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంటర్‌లో మొత్తంగా 66.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఈ ఇంటర్ ఫలితాలలో.. అవకతవకలు జరిగి.. తమకు మార్కులు తక్కువ వచ్చాయని.. కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే నిన్న పదో తరగతి పరీక్షల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ పదవ తరగతి ఫలితాలు కూడా అచ్చం ఇంటర్ లాగే ఉన్నాయని… విద్యార్థులు అలాగే కొంతమంది విపక్ష నాయకులు వాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పరీక్షల ఫలితాలు చూస్తే…
2016 94.77%
2017 91.9%
2018 94.4%
2019 94.8%
2020 రద్దు
2021 రద్దు
2022 67%
2023 72% గా నమోదు అయ్యాయి. బాగా చదివినాళ్ళకు కూడా తక్కువ మార్కులే వచ్చాయి. ఎప్పుడు ఫలితాలు రిలీజ్ చేసిన ఇలాంటి తప్పిదాలు జరిగితే… ఇంటర్ ఫలితాల తరహాలోనే.. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు కొంతమంది విద్యార్థులు.