ఏపీకి అలెర్ట్… మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత

-

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 10 గంటలకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 అయితే తప్పితే ఎండల ప్రభావం తగ్గడం లేదు. జనాలు ఎండల తీవ్రత, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టెందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే ఇళ్ల నుంచి బయటకు కదలడం లేదు. 

ఏపీకి అలెర్ట్  ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే తీవ్ర వడగాల్పలతో ఉత్తర కోస్తా వసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నైరుతి దిశ నుంచి వీచిన పొడిగాలులతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఏపీల 670 మండలాలకు గానూ… 539 మండలాల్లో ఆదివారం వేడి వాతావరణం నెలకొంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాలు కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతుందని వివప్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news