బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఎప్పుడంటే..?

-

ఐఎండి సూచనల ప్రకారం మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వివరించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 80.5మిమీ,విశాఖ రూరల్లో 62.2మిమీ, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో 60.7మిమీ అధిక వర్షపాతం నమోదైందన్నారు

Read more RELATED
Recommended to you

Latest news