ఏపీకి గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్..!

-

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో దేశంలోనే వరుసగా మూడోసారి ఆంధ్రప్రదేశ్ కి అగ్రస్ధానం దక్కింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కి భారీ పరిశ్రమ పెట్టుబడులు రాబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టేందుకు రెడీ అవుతుంది. కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ఏరియాలో నిర్మితం అవ్వనున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

అలాగే గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్‌ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం దిగజారుడు తనం అన్నారు. తమ వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని.. మరి ఇప్పుడు టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని గౌతమ్ రెడ్డి ప్రశ్నించారు. ఇకపోతే ఆపిల్ కంపెనీకి చైనాలో ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయి. సేమ్ అక్కడ ఉన్న మోడల్ లోనే కడప జిల్లాలో కూడా ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news