APRTC : ఆర్టీసీ సంక్రాంతి కానుక అందించింది. సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ఆర్టీసీ. నేటి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ.
ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అన్ని సాధారణ సర్వీసులు రిజర్వ్‌డ్ ఉంటాయి. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ఏపీ ఆర్టీసీ ప్రకటించింది. ముందస్తు రిజర్వేషన్లకు 10 రాయితీ కూడా ఇస్తామని వెల్లడించింది ఆర్టీసీ. డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించింది.