వైసీపీ పార్టీకి దూరంగా బీజేపీ నేతలు…!

-

వైకాపాకు అనుకూలమన్న అపప్రదను తొలగించుకోవాలని బీజేపీ నాయకులు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వార్తా కథనాలను చూశామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా తప్పులను చేసిందని, ఆ తప్పులన్నింటినీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించినట్లుగా తెలిసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ నాయకుడు సత్య కుమార్ గారు చెప్పినట్లుగా పొత్తు కోసం వారు అడగాలి…వీరు అడగాలని కోరుకోవడంలో అతిశయోక్తి లేదని, ఇల్లరికం చిత్రంలో పాట మాదిరిగా చేతులు కలిసిన చప్పట్లు… మనసులు కలిసిన ముచ్చట్లు అన్నట్లుగా మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నదే తన ఆకాంక్షని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కొందరి అభ్యంతరాల మధ్య తాను ఈ నిర్ణయాన్ని తెలియజేస్తున్నానని అభ్యంతరాలు పెట్టే వాళ్ళు కూడా ఈ రఘురామకృష్ణ రాజు ఇంతగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రస్తుతానికి కూసింత అపార్థం చేసుకున్నా, రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారని విశ్వాసంతో ఈ మాట చెబుతున్నానని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాముల వారి విగ్రహ స్థాపన అనంతరం ఒకటి రెండు రోజులలోనే గుడ్ న్యూస్ వింటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news