ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీఐపీ+, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాలు పడినా ప్రమాణస్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్‌ ఫ్రూఫ్‌ షెడ్లను వేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news