మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు అని.. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు… రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని నిప్పులు చెరిగారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని అగ్రహించారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని.. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news