కొన్ని రోజులుగా వైసీపీకి పక్కలో బల్లెంలా తయారయిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీద ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రఘు రామకృష్ణం రాజు..రాజు కాని రాజు అని, ఆయన మేక తోలు కప్పుకున్న నక్క అని అన్నారు. రఘురామకృష్ణంరాజు శిఖండి లా వ్యవహరిస్తున్నారని ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేప్పుడు రఘు రామకృష్ణంరాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే రఘు రామకృష్ణం రాజు చదువుతున్నారని ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి..మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. అసలు తొట్లకొండ, బావికొండ ఎక్కడ ఉన్నాయో కూడా రఘు రామకృష్ణం రాజుకి తెలియదని ఆయన అన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రదేశాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మా ప్రభుత్వం అమరావతికి, అమరావతి రైతులకు వ్యతిరేకం కాదన్న ఆయన అమరావతిని అభివృద్ధి చేస్తూనే..విశాఖ,కర్నూల్ కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఎవరూ కోరుకోవడం లేదన్నది తప్పని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని మంత్రి విమర్శించారు.