టీడీపీ ఎమ్మెల్సీకి రెండోసారి కరోనా..పరిస్థితి విషమం

టీడీపీ సీనియర్ నేత, కృష్ణా జిల్లా మాజీ అధ్యక్ష్యుడు ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ తో విజయవాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరిన బచ్చుల నెగిటివ్ అని తేలాక డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ పాజిటివ్ రావటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశారు చంద్రబాబు.

ఊపిరి తీసుకోవటంలో బచ్చుల అర్జనుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన గతంలో  ఎలాంటి పెద్ద పదవులు అనుభవించ లేదు. మచిలీపట్నం చైర్మన్ గాసేవలుఅందించారు.