వేసవి కాలంలో.. ఏపీలో కరెంటు కోతలు ఉండవు : మంత్రి బాలినేని

-

వేసవి కాలంలో.. ఏపీలో కరెంటు కోతలు ఉండవని విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ దేవినగర్ ట్రెండ్ సెట్ మాల్ లేఔట్ లో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తప్పులు మేం సరిదిద్దుతున్నామని.. 26వేల కోట్లు అప్పు పెట్టిన గత ప్రభుత్వం పవర్ గురించి మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. సమ్మర్ లో పవర్ కట్ లేకుండా చేస్తామని.. సంక్షేమ పధకాలు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు మమ్మల్ని నిలదీస్తారా అని ఆగ్రహించారు. గడపగడపకి వెళ్ళాలని సీఎం దిశానిర్దేశం చేసారని.. ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

చంద్రబాబు మాకు పోటీ కాదు అని సీఎం అన్నారని.. మీడియా వక్రీకరిస్తే ఊరుకునేది లేదని ఫైర్‌ అయ్యారు. రాబోయే రెండు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తామని.. పీపీఏల పై సీఎంతో చర్చించి కోర్టుకు వెళతామని పేర్కొన్నారు. యూనిట్ కు 4.35 రూపాయలు చాలా ఎక్కువ అని.. గత ప్రభుత్వం పీపీఏలను అధికంగా చేసి అన్యాయం చేసిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news