ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో వైసీపీ కి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడుతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరిగింది. పార్టీ తీరు పై అసంతృప్తి లో ఉన్నారు మాజీ మంత్రి బాలినేని. దీంతో పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రచారం జరిగినట్టుగానే తాజాగా వైసీపీ కి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు.
వాస్తవానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలకు ముందే జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. కానీ ఎన్నికల సమయంలో వైసీపీలోనే కొనసాగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గత కొంత కాలంగా ఆయన వైసీపీలో అసంతృప్తితోనే ఉన్నారు. ఇటీవలే మాజీ సీఎం జగన్ తో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల తరువాత కూడా అసంతృప్తిగా ఉండటంతో పార్టీ వీడనున్నట్టు ఖాయమైంది. వైసీపీకి రాజీనామా చేసి.. మాత్రం ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాలుగు సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు బాలినేని. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి తొలి రెండున్నరేళ్లు మంత్రిగా పని చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దామరచర్ల జనార్ధన్ చేతిలో ఓడిపోయారు.