బర్రె పాలిచ్చినంత వరకు సరే….ఎక్కువగా లాగితే రక్తం వస్తుంది : ఏపీ ఉద్యోగులు

-

బర్రె పాలిచ్చినంతవరకు బాగుటుంది.. ఇంకా ఎక్కువగా లాగితే రక్తం వస్తుందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులంతా ఓ కుటుంబమని సీఎం అన్నారని.. కరోనా లేకుండా ఉండి ఉంటే ఊహించని దాని కంటే ఎక్కువగా ఇద్దామనుకున్నానని సీఎం చెప్పారని.. కరోనా వల్ల ఊహించినంత ఫిట్ మెంట్ ఇవ్వలేకపోయినట్లు సీఎం తెలిపారని పేర్కొన్నారు.

bandi

హెచ్ ఆర్ ఎ శ్లాబులు, అడిషనల్ క్వాంటమ్, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబ్దదీకర ,సీపీఎస్ రద్దుపై సీఎం స్పష్టత ఇచ్చారని.. ఉద్యోగులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. ప్రతి నెలా ఉద్యోగులతో మంత్రుల కమిటీ సమావేశమై సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారని.. మా డిమాండ్ల సాధన వల్ల అదనంగా 11500 కోట్లు భారం పడుతుందని సీఎం తెలిపారన్నారు.

సామాన్య ఉద్యోగి, టీచర్ అభిలాషకు అనుగుణంగా నాలుగు జేఎసీలు పనిచేశాయని.. మున్ముందు కూడా పీఆర్సీ సాధన సమితి పనిచేస్తుందని తెలియజేస్తున్నానని వివరించారు. ఫ్యాక్టో ఛైర్మన్ జోషప్ సుధీర్ తో మాట్లాడామని.. ఉపాద్యాయుల సంఘాలేమీ బయటకు వెళ్లలేదని చెప్పారు. నిన్నటి సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు అన్నింటికీ అంగీకరిస్తూ సంతకాలు చేశారని.. ఫిట్ మెంట్ పెంచకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారని బండి శ్రీనివాసరావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news