చంద్రబాబు ప్లేస్‌ నన్ను చంపేయండి… జైల్లో పెట్టండి – బండ్ల గణేష్‌

-

హైదరాబాదులో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ లో నిర్మాత బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు.

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బృందం తమ సంగీత ప్రదర్శనతో సభకు వచ్చినవారిని ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జైలులో సిబిఎన్ ను చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. ఏం చేశాడని జైల్లో పెట్టారు? బాబు కేసు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే…. నన్ను చంపేయండి. జైల్లో పెట్టండి. బాబు దేశానికి అవసరం. ఆయన పక్కనున్నవాళ్లు ఎంత గొప్పవాళ్లు? దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు మొనగాడు చంద్రబాబు’ అని ఆయన మాట్లాడిన స్పీచ్ ను టిడిపి శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news