ప్రపంచంలోనే అత్యంత చౌకైన టెలికాం సేవలు భారత్‌లోనే ఉన్నాయని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇక ముందూ కూడా అందుబాటు ధరలోనే కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి వెల్లడించారు. 2021 సంవత్సరంలో వచ్చిన తొలి దశ సంస్కరణల్లో భాగంగా టెలికాం కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు వైష్ణవ్ పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్- 4G నెట్‌వర్క్ విస్తరణ దీపావళి తర్వాత ఊపందుకుంటుందని వైష్ణవ్ తెలిపారు. త్వరలో.. దీన్ని 5G నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు.
6జీపై తమ రోడ్‌మ్యాప్‌ను వెల్లడిస్తూ.. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నాయకత్వం వహించాలని భారత టెలికాం సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. భారత్ 6G విజన్‌ను ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ఆమోదించినట్లు తెలిపారు. యూజర్ల రక్షణపై దృష్టి సారిస్తూ టెలికాం రంగంలో రెండో దశ సంస్కరణలు ప్రారంభమయ్యాయని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో వచ్చిందే సంచార్ సాథి అని వివరించారు. టెలికాం రంగంలో మరిన్ని మార్పులూ రాబోతున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపార