టీడీపీలో “బీసీ టెన్షన్” పీక్స్ కి చేరింది… కారణాలివే!

-

ఏనాడైతే జగన్ కు బీసీలు దగ్గరవుతున్నారో.. బీసీలకు జగన్ దగ్గరవుతున్నారో.. నాటినుంచి టీడీపీలో వణుకు మామూలుగా స్టార్ట్ అవ్వలేదనే టాక్స్.. పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్స్ లో కూడా బలంగా వినిపిస్తున్నాయంట. అందుకు కారణం అయ్యింది… బీసీ కార్పొరేషన్స్ ప్రకటించడం.. బీసీలో అందరికీ ధైర్యం కలిగించడం. ఫలితంగా మైకులందుకున్నారు టీడీపీ నేతలు!

బీసీ కార్పొరేషన్ ప్రకటించి సుమారు 700 మందికి పదవులు ఇచ్చినంత మాత్రాన్న.. బీసీలు ఆర్ధికంగా మరింతగా ఎదగడానికి కార్పొరేషన్స్ సహకరించినంతమాత్రాన్న… పెద్దగా ఒరిగేదేమీ లేదు అన్నట్లుగా స్పందించారు ఏపీ టీడీపీ కొత్త కథానాయకుడు అచ్చ్చెన్నాయుడు! కానీ… ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కల్పించినంతమాత్రాన్న.. టీడీపీ బీసీలకు పెద్ద పీట వేసినట్లంట! ఆయన జ్ఞానం సంగతి అలా ఉంచితే… టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తాజాగా స్పందించారు!

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని.. బీసీల సంక్షేమానికి పాటుబడిన ఘనత, రాజ్యార్హత కల్పించింది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు అంగర రామోహన్. అవన్నీ జరిగితే 2019 ఎన్నికల్లో ఎందుకు బీసీలంతా ఒకమాటమీద నిలబడి బాబు ని తొక్కి పారేశారో టీడీపీ నేతలే చెప్పాలి. ఇక జగన్ కేబినెట్ లోనూ, రాజ్యసభలోనూ బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం బీసీలకు జగన్ ఇస్తున్న ఈ విలువ, జగన్ కి బీసీలు ఇచ్చిన విలువ లు విశ్వసనీయతలు.. ప్రస్తుతం బాబు & కోని తెగ టెన్షన్స్ పెడుతున్నాయని.. ప్రస్తుతం అందుకే బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నారని చెబుతూ.. ఆత్మవంచన చేసుకుంటున్నారు! అందుకే బీసీల నామజపం చేస్తూ ముందుకు పోవాలని.. జగ్న కు బీసీలకు మద్య పుల్లలు పెట్టేలా నమ్మించేమాటలు చెప్పాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు!

అయితే ఇక్కడ టీడీపీ నేతలు గ్రహించాల్సిందేమిటంటే… బీసీలు టీడీపీ నేతలకంటే తెలివైనవారని! తమను ఎవరు ఉపయోగించుకుంటున్నారు.. తమకు ఎవరు ఉపయోగపడుతున్నారు అన్నది వారు గ్రహిస్తున్నారని!

Read more RELATED
Recommended to you

Latest news