ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో CID విచారణలో ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా సిమెన్స్ మాజీ ఉద్యోగి భాస్కర్ ను పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు.
ఆయనను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించనున్నారు. సిమెన్స్ సంస్థ రూపొందించిన ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అసలు ధర రూ. 58 కోట్లు ఉంటే దానిని రూ.3,300 కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టారని సిఐడి చెబుతోంది.