AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఏబీ వెంకటేశ్వరరావు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే.. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏపీ హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్జిత లీవ్స్ పై విదేశాలకు వెళ్లేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు కు అనుమతి నిరాకరిస్తూ సి ఎస్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది ఏపీ హైకోర్టు.
ఈ విషయంలపై ఇవాళ ఏపీ హై కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరకరించిన సీ ఎస్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. దీనిపై విచారణ జరిపి నేడు తీర్పు నిచ్చింది ఏపీ ఉన్నత న్యాయస్థానం. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది.