జగన్ సర్కార్ కు బిగ్ షాక్ తగలింది. కరోనా నిధుల పక్కదారిపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారం పై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు అయింది.
పిడి ఖాతాలకు మళ్ళించిన నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.
పిడి ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 11 వందల కోట్లు చెల్లించాలని ఎస్ డి ఆర్ ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో ఫిర్యాదు పరిష్కరించాలని జగన్ సర్కార్ ను ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.