ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం అదేనని… విద్యా సంస్థల్లో ప్రవేశంతో పాటు నియామకాలు సహా దేనికైనా అదే ప్రధానం అని కలెక్టర్లకు సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు, వివాహం నమోదుకు అది తప్పనిసరి చేశారు. ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో మొత్తం 14,752 నమోదు యూనిట్లు ఏర్పాటు చేశారు. జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లను వారంలో ఇవ్వాలన్నారు.