రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా ప్రధాని మోదీ చూసుకోండి అంటూ సెటైర్లు పేల్చారు పేర్ని నాని. వైసిపి, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఎవ్వడు నమ్మడు….కనీసం తెలుగుదేశం, జనసేన కూడా నమ్మదన్నారు. మోడీ సభపై పేర్ని నాని మాట్లాడుతూ… మూడు పార్టీల చిలకలూరిపేట సభ వెలవెలబోయింది… 2019లో పాచిపోయిన లడ్లు చిలకలూరిపేట సభకు తాజాగా ఎలా మారాయని ఫైర్ అయ్యారు.
‘ఈ సభలో ప్రధాని మోదీకి అవమానం జరిగింది. మైక్ మూగబోవడంతో ఆయన బొమ్మలా నిలబడ్డారు అని అన్నారు. సభ జరుపుకోవడం చేతకానివారు జగన్పై యుద్ధం అంటున్నారు అని విమర్శించారు. లోపాయికారి ఒప్పందం చేసుకున్న మీకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? ఎన్టీఆర్పై గౌరవం ఉంటే భారతరత్న ఎందుకు ఇవ్వలేదు’ అని ఆయన ప్రశ్నించారు పేర్ని నాని.