వైసీపీలో బొత్స సత్యనారాయణ ఒక్కడే గ్రేట్ లీడర్ అనే అర్థం వచ్చేలా బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. మేం పోటీలో లేం కాబట్టి బొత్స సత్యనారాయణ ఎన్నిక సాధ్యమైంది…పోటీ చేసి ఉంటే ఎమ్మెల్సీ సీటు కూటమిదే అన్నారు. వైసీపీలో విలువలతో ఉన్న నాయకుడు బొత్స సత్యనారాయణ ఒక్కరే అన్నారు. అచ్చుతాపురం ప్రమాద ఘటనపై జగన్మోహన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేసి తన స్థాయిని తగ్గించుకున్నారని తెలిపారు.
బాధితులే ఆశ్చర్యానికి గురి అయ్యే వేగంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలతో పాటు పరిహారాన్ని అందించిందని వెల్లడించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కమిటీ వేయడం విచారణ చేయడం అంటే పోస్టుమార్టం లాంటిది…. అసలు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించిందన్నారు. రుషికొండ నిర్మాణం, అక్కడ అక్రమాలపై త్వరలోనే ఏపీటీడీసీ నుంచి వివరాలు కోరుతూ లేఖ రాస్తానని తెలిపారు బిజెపి శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు.