ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.ఇంటర్మీడియట్ బోర్డును కూడా ప్రభుత్వంలో కలపనున్నామన్నారు. మా దృష్టికి రాకుండా పెండింగ్ లో ఉన్న అంశాల నిర్ణయాలపై సమావేశమయ్యాం…డీడీఓ అధికారం హెడ్ మాస్టర్లకు ఇస్తున్నామని మీడియా కు వివరించారు. జనరల్ ట్రాన్సఫర్లు, టీచర్ల ప్రమోషన్లపై చర్చించాం…రెండో ఎంఈఓ పోస్టులు 680 ఆమోదించామన్నారు.
తాత్కాలికంగా ఏపీఎంలకు బాధ్యతలిచ్చాం.కొత్త జూనియర్ కాలేజీలకు అన్ని సదుపాయాలు నాడు నేడు ద్వారా ఇస్తున్నాం…ఇంటర్మీడియట్ బోర్డును కూడా ప్రభుత్వంలో కలపనున్నామని చెప్పారు. కొత్త విద్యా విధానంలో భాగంగా ఇంటర్మీడియేట్ వరకు ఒకే బోర్డు పరిధిలోకి తెస్తున్నాం…స్కూలు విద్యను పటిష్ఠం చేయడానికి ఈ కార్యక్రమం అని వెల్లడించారు బొత్స సత్యనారాయణ.