తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి.. ఏపీ అభివృద్ధికి 130 కోట్లు విడుదల

-

 

తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపించింది. ఏపి కి 136 కోట్ల రూపాయలు సహాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ లోని పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రo ఈ ఆర్ధిక సహాయం చేసింది. ఈ విడతలో ఏపి, యు.పి, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది.

ఏపిలోని విజయవాడ, విశాఖపట్నం ల అభివృద్ధి కోసం కేంద్రo సహాయం చేసింది. 2022-23 ఆర్దిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు దేశంలోనే పలు ప్రధాన పట్ణణాల అభివృద్ధి కోసం కేంద్రం 4, 761 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం చేసింది.ఏపి కి ఇప్పటివరకు 2022-23 ఆర్దిక సంవత్సరానికి గాను 293.75 కోట్ల రూపాయల కేంద్ర ఆర్ధిక సహాయం అందించింది. తెలంగాణ కు ఇప్పటివరకు 331.40 కోట్ల రూపాయలు కేంద్ర ఆర్దిక సహాయం మాత్రమే చేసింది. 15 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల్లో భాగంగా నిధులను విడుదల చేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news