కేశినేని నాని ఫ్యామిలీపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.కేశినేని నానిని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతుందని.. రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని ఫైర్‌ అయ్యారు. ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన నాని.. వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారు…పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నాడని వెల్లడించారు. కేశినేని నానికి వాళ్ల అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదు….తమ్ముడు పోటీగా నిలబడితే.. చెల్లి కూడా నాని ఛాయలకు రాలేదని ఎద్దేవా చేశారు.

budda slams kesineni nani

ఎవరి ద్వారా లబ్ది, సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజమని… సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవాడని చురకలు అంటించారు. సుజనా ద్వారా ఎంత సాయం పొందాడో నాని మరచిపోయాడేమో..? మేము దగ్గర ఉండి నాని‌ వేషాలన్నీ‌ చూశామన్నారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్ కు డబ్బులు ఇవ్వాలి….ఐఓబీకి ముప్పై కోట్లు బజాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ లో కూడా ఇవే అప్పులు రాశాడు…పదేళ్ల కాలంగా అప్పులు కట్టని నానినా. ఇతరుల గురించి మాట్లాడేదన్నారు. నీచ, నికృష్టుడు అనే పదాలకు నాని సరిపోతాడని ఫైర్‌ అయ్యారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news