ఏపీ ప్రజలకు అలర్ట్.. సిలిండర్ డెలివరీకి డబ్బులు అడిగితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి

ఏపీ ప్రజలకు అలర్ట్. ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు, రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌరసరాఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్నిత పరిధిలో ఉన్న కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు ఆదణపు చార్జీలను వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలన్నారు. పౌరసరాఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ 1967, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్ ఫ్రీ నెంబర్ 1800 2333555కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.